Virat Kohli: వికెట్ల మధ్య ఫాస్టెస్ట్‌ రన్నర్‌ ఎవరు..? వరస్ట్‌ రన్నర్‌ ఎవరు..? కోహ్లీ సమాధానాలివే..

వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే బ్యాటర్‌ ఎవరు..? ఎవరు నెమ్మదిగా పరుగెత్తుతారు.. ఇలాంటి ప్రశ్నలు విరాట్‌ కోహ్లీ(Virat Kohli)కి ఎదురయ్యాయి. అతడు చెప్పిన సమాధానాలేంటంటే..

Updated : 24 Mar 2023 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధానత్యనిస్తాడో తెలిసిందే. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే ఈ ఆటగాడు.. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తుతాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా సులువుగా మార్చుతాడు. ఇలా వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎందరో దిగ్గజ బ్యాటర్లతో కోహ్లీ పిచ్‌ షేర్‌ చేసుకున్నాడు. వారిలో మాజీ కెప్టెన్‌ ధోనీ ఒకరు.

అయితే.. వేగంగా సింగిల్స్‌(Quick Singles) ఎవరు తీస్తారు..? అనే విషయంపై ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌(AB de Villiers)-కోహ్లీ మధ్య చర్చ జరిగింది. తనతోపాటు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసుకోవాలని కోహ్లీకి ప్రశ్న ఎదురైంది. దీనికి విరాట్‌ చెప్పిన సమాధానం ఎంటో తెలుసా..? ఆ పేరు ధోనీ కాదు. అతడు చెప్పిన పేరు ఏబీడీయే.

‘ఈ ప్రశ్న నాకు ఇంతకుముందు కూడా ఎదురైంది. వికెట్ల మధ్య నాతో అత్యంత వేగంగా పరుగెత్తే ఆటగాడు ఏబీ డివిలియర్స్‌. వికెట్ల మధ్య ఎంతో సహకారాన్ని అందించే మరో ఆటగాడు ధోనీ. వాళ్లు ఎంత వేగంగా పరుగెత్తుతారో నాకు తెలియదు. కానీ.. ఏబీ, ధోనీతో కలిసి ఆడితే.. పరుగు కోసం వారిని పిలవాల్సిన అవసరమే ఉండదు’ అని కోహ్లీ వివరించాడు. ఇక ఇదే ప్రశ్న ఏబీడీని అడిగితే.. అతడు డుప్లెసిస్‌ పేరు చెప్పాడు.

ఇక వికెట్ల మధ్య అత్యంత నెమ్మదిగా పరుగెత్తే(worst runner) బ్యాటర్‌ ఎవరు..? అని కోహ్లీని అడిగితే.. ఇది వివాదాస్పదమైన ప్రశ్న అంటూనే  పుజారా పేరును నవ్వుతూ చెప్పాడు. 2018లో సెంచూరియన్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో పుజారా రనౌట్‌ అయ్యాడని.. అప్పుడు అతడు పరుగెత్తిన విధానాన్ని విరాట్‌  గుర్తుచేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని