కోహ్లీ ఇందులో నీ కష్టం కనపడుతోంది..!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఎంత ఫిట్‌నెస్‌తో ఉంటాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్‌లున్నా లేకున్నా నిత్యం శారీరక వ్యాయామాలు చేస్తుంటాడు. అతడి నుంచే టీమ్‌ఇండియా ఆటగాళ్లూ చాలా మంది...

Published : 20 Feb 2021 14:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఎంత ఫిట్‌నెస్‌తో ఉంటాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్‌లున్నా లేకున్నా నిత్యం శారీరక వ్యాయామాలు చేస్తుంటాడు. అతడి నుంచే టీమ్‌ఇండియా ఆటగాళ్లు చాలా మంది శరీర సౌష్టవంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలా అతడు బలంగా ఉంటూనే తోటి క్రికెటర్లను కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేలా పరోక్షంగా తోడ్పడుతున్నాడు.

అయితే, విరాట్‌ తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న పలు ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. నిలకడత్వమే తన శారీరక దృఢత్వానికి ముఖ్య కారణమని పేర్కొన్నాడు. వాటిని చూసిన అతడి ఫాలోవర్లు టీమ్‌ఇండియా సారథి కష్టాన్ని గుర్తించి కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్‌గా మారాక తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించాడు కోహ్లీ. ఈ క్రమంలోనే ఎప్పుడూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటూ ఆరోగ్యంగా ముందుకు సాగుతున్నాడు. దాంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు. ఇక ఇటీవలి కాలంలో శతకాలు సాధించలేకపోతున్న టీమ్‌ఇండియా సారథి బుధవారం నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే డే/నైట్ టెస్టులోనైనా మూడంకెల స్కోర్‌ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని