Virat kohli: ఆ ఫ్రైడ్‌ రైస్‌ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను: విరాట్

ఫిట్‌నెస్‌ విషయంలో కఠినంగా ఉన్నా తాను కూడా భోజనప్రియుడినేనని.. చిరుతిళ్లను బాగా ఇష్టపడేవాడినని కోహ్లీ తెలిపాడు. 

Published : 15 Dec 2022 02:22 IST

దిల్లీ: టీమ్‌ఇండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat kohli) ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరు. తాను కోరుకున్న ఆకృతి కోసం కఠినమైన డైట్‌ ఫాలో అవ్వడం, కసరత్తులు చేయడంలో ఈ ఆటగాడు ఏమాత్రం రాజీపడడు. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ తన చిన్ననాటి విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడంటే ఆహార నియమాలు  ఉన్నాయి గానీ చిన్నప్పుడు రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలను ఇష్టంగా తినేవాడినని తెలిపాడు. చైనీస్‌(Chinese food) వంటకాల గురించి మాట్లాడుతూ తాను తిన్న ఓ వంటకం రుచిని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. 

‘‘ఓసారి మేం ఒక చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడున్న వాన్‌ పేరు ‘చుక్‌ చుక్‌ మెయిల్‌’. వారు చేసిచ్చిన మాంచో సూప్‌, ఫ్రైడ్‌ రైస్‌ని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ చైనీస్‌ వంటకం రుచి మరెక్కడా దొరక్కపోవచ్చు’’ అంటూ వివరించాడు.  ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా(Vikas khanna)ను తన సొంత రెస్టారెంట్‌ ‘వన్‌8 కమ్యూన్‌’కు కోహ్లీ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ  వీడియోను విరాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని