IND vs AUS: రోహిత్, రాహుల్‌ అలా చెప్పడం వల్లే నా బ్యాటింగ్‌ స్ట్రాటజీ మారింది: విరాట్

ఉప్పల్‌ మైదానం విరాట్ కోహ్లీకి బాగా కలిసొస్తుందో మరోసారి నిరూపితమైంది. ఆసీస్‌ జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ...

Updated : 26 Sep 2022 16:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉప్పల్‌ మైదానం విరాట్ కోహ్లీకి బాగా కలిసొస్తుందనే విషయం మరోసారి నిరూపితమైంది. ఆసీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టిన విరాట్ (48 బంతుల్లో 63 పరుగులు).. సిరీస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన సమయంలోనూ దూకుడు ప్రదర్శించిన కోహ్లీ.. సూర్యకుమార్‌ ధాటిగా ఆడే క్రమంలో కాస్త నెమ్మదించాడు. సూర్యకుమార్‌ (69)తో కలిసి మూడో వికెట్‌కు విలువైన 104 పరుగులను జోడించాడు. దీంతో ఆసీస్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.5 ఓవర్లలో ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం తన బ్యాటింగ్‌ స్ట్రాటజీ ఏంటనేది విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పలు సూచనలు చేశారని పేర్కొన్నాడు.

‘‘ఒక ఎండ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ భారీగా హిట్టింగ్‌ చేస్తున్న క్రమంలో నేనొకసారి డగౌట్‌ వైపు చూశా. కెప్టెన్ రోహిత్, కోచ్‌ ద్రవిడ్‌.. ‘నువ్వు అలాగే నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ ఉండు’.. అనే అర్థం వచ్చేలా చెప్పారు.  ఎందుకంటే సూర్యకుమార్‌ చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే మంచి భాగస్వామ్యం నిర్మించాలని సూచించారు. దీంతో నా అనుభవం కాస్త ఉపయోగించి నిదానంగా ఆడా. ఎప్పుడైతే సూర్య ఔటై పెవిలియన్‌ చేరాడో.. హిట్టింగ్‌ చేసేందుకు ప్రయత్నించా. కానీ కొన్ని బంతులను మిస్‌ చేశా. ఈ క్రమంలో ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదడంతో సెట్‌ అయిపోయా. ఇక భారత్‌ తరఫున ఆడేటప్పుడు ఎక్కువగా నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో దిగుతున్నా. నా అనుభవం వినియోగించి జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నాకు మంచి ఆరంభమే వచ్చింది. అయితే ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడా. ఎందుకంటే మిడిల్‌ ఓవర్లలో ఆసీస్‌కు చాలా కీలక బౌలర్. ఓ వైపు సూర్యకుమార్‌ హిట్టింగ్‌ చేస్తుండటంతో అతడికి సహాయక పాత్ర పోషించా’’ అని విరాట్ వివరించాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని