Virat Kohli : ఇతర ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చినా.. వెళ్లకపోవడానికి కారణమదే: కోహ్లీ

టీ20 లీగ్‌ తొలి సీజన్‌ నుంచి ఇప్పటి వరకు ఒకే జట్టుకు ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బెంగళూరు తరఫున 218 మ్యాచ్‌లను ఆడాడు. ఎనిమిది సీజన్లు ...

Published : 06 May 2022 02:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌ తొలి సీజన్‌ నుంచి ఇప్పటి వరకు ఒకే జట్టుకు ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బెంగళూరు తరఫున 218 మ్యాచ్‌లను ఆడాడు. ఎనిమిది సీజన్లు బెంగళూరుకు నాయకత్వం వహించాడు. విరాట్ ఐదు శతకాలు, 43 అర్ధ శతకాలతో 6,499 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 113 పరుగులు. గత సీజన్ వరకు భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కోసం ఇతర జట్లూ భారీ ఆఫర్లను ప్రకటించాయి. అయితే, కోహ్లీ వాటన్నింటనీ వదులుకొని బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికిగల కారణాలను విరాట్ కోహ్లీ వెల్లడించాడు. బెంగళూరు జట్టుపై ఉన్న ప్రేమే తనని ఇతర జట్లవైపు వెళ్లకుండా చేసిందని పేర్కొన్నాడు.

‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇతర ఫ్రాంచైజీల నుంచి వచ్చిన ఆఫర్లను పరిశీలించా. వేలంలోకి రావాలని చాలా మంది సంప్రదించారు. నేను కూడా వేలంలోకి వెళ్లి నా విలువ ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలని భావించా. అయితే, తర్వాత దాని గురించి బాగా ఆలోచించా. ప్రతి ఒక్కరి జీవితం ఏదోవిధంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. ట్రోఫీలు గెలిచిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ, ఎవరూ కూడానూ..  అతడు ఇది గెలిచాడు.. అది గెలిచాడు అని ప్రతి సారి చెప్పరు. వ్యక్తిగతంగా మీరు మంచి వ్యక్తి అయితే ప్రజలు, అభిమానులు ఇష్టపడతారు. ఒకవేళ చెడ్డవారైతే మాత్రం దూరంగా పెడతారు. నా వరకైతే బెంగళూరుతో ఉన్న అనుబంధం ఎలా ఉందనే విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటా. ఇప్పటి వరకు నాపై నమ్మకం ఉంచిన బెంగళూరు యాజమాన్యం మద్దతుగా నిలిచింది. మరీ ముఖ్యంగా కెరీర్‌ ప్రారంభంలో, ఫామ్‌లో లేని సమయంలో అండగా ఉంది’’ అని కోహ్లీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని