Team India: బస్సులో టీమ్‌ఇండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్

టీమ్‌ఇండియా క్రికెటర్లు హోలీ సంబరాలు (Holi Celebrations) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శుభ్‌మన్‌ గిల్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు.

Published : 07 Mar 2023 20:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు (Holi Celebrations) అంబరాన్నంటాయి. నగరాల్లో వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. పలుచోట్ల యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో అలరించారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మ్యాచ్‌లతో బిజీగా ఉన్న టీమ్‌ఇండియా (Team India) క్రికెటర్లు సైతం హోలీ సంబరాల్లో మునిగితేలారు. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత క్రికెటర్లు జట్టు బస్సులో హోలీ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీమ్‌ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. గిల్ ఈ వీడియోని రికార్డు చేయగా..  విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ  (Rohit Sharma) ముందు నిలబడి ‘హే రంగ్ బర్‌సే’ అనే హిందీ పాటకు  రంగులు చల్లుకుంటూ స్టెప్పులేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. రెండు గంటల్లోనే 8 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.

మార్చి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తుని ఖరారు చేసుకోవాలని టీమ్‌ఇండియా గట్టి పట్టుదలతో ఉంది. ఆసీస్‌తో మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మూడో టెస్టులో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు