
Virat Kohli: ఆ విషయమే నాకు బాధ కలిగించింది: విరాట్ కోహ్లీ
ఫామ్ అందుకున్నాక ఏం చెప్పాడంటే?
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత టీ20 లీగ్‌లో ఫామ్ కోల్పోయిన బెంగళూరు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గతరాత్రి ఒక్క ఇన్నింగ్స్‌తో అందరినీ సంతోషంలో ముంచెత్తాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫామ్ అందుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తన ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో తాను జట్టు కోసం రాణించలేకపోయానని, దాంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. గణాంకాలు కాకుండా ఆ విషయమే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు.
‘ఈ మ్యాచ్‌లో నేను మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా టీమ్ మంచిస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే. అలాంటప్పుడు మన ఆలోచనా విధానాన్ని సరైన దృక్పథంలో ఉంచుకోవాలి. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. నేనీ మ్యాచ్‌లో రాణించేందుకు చాలా కష్టపడ్డా. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో 90 నిమిషాల పాటు సాధన చేశా. దీంతో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగా. షమి బౌలింగ్‌లో తొలిషాట్ నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగింది. ఫీల్డర్లపై నుంచి ఆడగలననే ఆత్మవిశ్వాసం లభించింది. అలాగే ఈ సీజన్లో అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. వాళ్లందరి ప్రేమా ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని విరాట్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా, గుజరాత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు రెండు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. విరాట్ (73), డుప్లెసిస్ (44), మాక్స్వెల్ (40*) దంచికొట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Crime news: పట్టపగలే టైలర్ దారుణ హత్య.. ఉదయ్‌పూర్‌లో టెన్షన్.. టెన్షన్..
-
General News
Covid update: కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. తెలంగాణలో కొత్తగా 459 కేసులు
-
Movies News
Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణ.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం
-
World News
Prison Escape: కొలంబియా కారాగారంలో విషాదం.. 49 మంది ఖైదీలు మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత