Published : 27 Feb 2022 12:53 IST

Virat Kohli: రాహుల్‌ అప్పట్లో టీ20 బ్యాట్స్‌మన్‌లా అస్సలు కనిపించలేదు: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కొత్త సారథి కేఎల్ రాహుల్‌ కెరీర్‌ ఆరంభంలో టీ20 స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌లా కనిపించలేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ మాజీ సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. తాజాగా కోహ్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే మొదట్లో అతడితో.. తాను పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయానని చెప్పాడు. రాహుల్‌ 2013లో ఆర్సీబీ జట్టులో ఆడగా తర్వాతి రెండేళ్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. తిరిగి 2016లో బెంగళూరు గూటికే చేరిన అతడు ఆ సీజన్‌లో 397 పరుగులతో రాణించాడు.

‘కరణ్‌ నాయర్‌, మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రాహుల్‌ 2013లో బెంగళూరు జట్టులోనే ఆడాడు. అయితే, అప్పుడు అతడు టీ20 బ్యాట్స్‌మన్‌లా అస్సలు కనిపించలేదు. ఇక అతడు ఆర్సీబీ జట్టును వీడాక నేను పట్టించుకోలేదు. కానీ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం అదరగొడుతున్నాడనే విషయాలు తెలుసుకున్నా. మా జట్టులో ఆడినప్పుడు యువకుడిలా ఉండేవాడు. మేం ఇద్దరం కలిసి ఎన్ని మ్యాచ్‌లు ఆడినా పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయాం. ఇక 2014లో అతడు ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసినప్పుడు మాత్రం బాగా ఆకట్టుకున్నాడు.  ఆటపై దృష్టిసారించి ఎంతో మెరుగ్గా తిరిగొచ్చాడు. దీంతో కంగారూల గడ్డపై మంచి ప్రదర్శన చేశాడు. అప్పుడే అతడి ఆత్మస్థైర్యం చూసి ముచ్చటేసింది’ అని కోహ్లీ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని