IND vs SA: కోచ్ రికార్డుపై కన్నేసిన కెప్టెన్
టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మాజీ ఆటగాడు, ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నెలకొల్పిన రికార్డును బద్దలు
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మాజీ ఆటగాడు, ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టనున్నాడు. దక్షిణాఫ్రికాలో 22 ఇన్నింగ్స్‌లు ఆడిన ద్రవిడ్ 29.71 సగటుతో 624 పరుగులు చేశాడు. ఈ రికార్డుకు కెప్టెన్ కోహ్లీ 66 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు కోహ్లీ ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం. ప్రస్తుత పర్యటనలో కోహ్లీ.. ద్రవిడ్ రికార్డును అధిగమిస్తాడనే అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ (558 పరుగులు) ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (28 ఇన్నింగ్స్‌ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (624 పరుగులు) రెండు, మాజీ టెస్టు స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ (18 ఇన్నింగ్స్‌ల్లో 566 పరుగులు) మూడు, గంగూలీ (16 ఇన్నింగ్స్‌ల్లో 506 పరుగులు) ఐదో స్థానంలో ఉన్నారు.
* కోహ్లీకి సచిన్ సలహాలు..
గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు చేశాడు. ‘నేనెప్పుడూ చెప్పేది ఒక్కటే.. ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చాలా ముఖ్యం. ప్రత్యేకించి దక్షిణాఫ్రికాలోని పిచ్‌లపై ఫ్రంట్ ఫుట్‌పై ఆడితే బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవచ్చు. అలాగే, చేతులను బాడీకి దూరంగా తీసుకెళ్లొద్దు. అలా చేస్తే మన శరీరంపై నియంత్రణ కోల్పోతాం. అందుకే చేతులు దగ్గర పెట్టుకుని ఆడాలి. తొలి సెషన్లో క్రీజులో నిలదొక్కుకోగలిగితే భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది’ అని సచిన్ సూచించాడు.
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాక కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న కోహ్లీ.. ఇప్పుడిప్పుడే ఆటపై పూర్తి దృష్టి పెడుతున్నాడు. ఇటీవల బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్న ఫొటోల్లో బ్యాటింగ్‌కు సంబంధించి కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి సలహాలు తీసుకుంటూ కనిపించాడు. ప్రస్తుతం అందరి కళ్లు వీరిద్దరి పైనే ఉన్నాయి. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కిదే తొలి విదేశీ పర్యటన. మరోవైపు, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాక.. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: భూకంప విలయం.. తుర్కియేకు భారత సహాయబృందాలు!
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతులు
-
India News
Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్
-
Movies News
Sembi Review: రివ్యూ: సెంబి
-
Movies News
Social Look: రెండు జళ్ల ప్రణీత.. దుబాయ్‌లో నేహాశర్మ.. అను ‘బ్లూ’ డ్రెస్సు!
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా