Virat Kohli: ఎప్పటికీ నువ్వే నా గ్రేటెస్ట్‌ ఆటగాడివి: విరాట్‌

టెన్నిస్‌ జెంటిల్మెన్‌ రోజర్‌ ఫెదరర్‌కు క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీ ఓ వీడియో సందేశం పంపించారు. దీనిలో ఆయన స్విస్‌ దిగ్గజం ఫెదరర్‌పై ఉన్న అభిమాన్నాన్ని వెల్లడించారు  ఈ విషయాన్ని

Updated : 29 Sep 2022 16:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్‌ జెంటిల్మెన్‌ రోజర్‌ ఫెదరర్‌కు క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీ ఓ వీడియో సందేశం పంపించారు. దీనిలో ఆయన స్విస్‌ సూపర్‌స్టార్‌ ఫెదరర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వీడియోను ఏటీపీ టూర్‌ (ది అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌) తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా 2015, 2018లో ఆస్ట్రేలియాలో ఫెదరర్‌ను కలిసిన విషయాన్ని కూడా విరాట్‌ గుర్తు చేసుకున్నాడు. 

‘‘హలో రోజర్‌, మాకు అందమైన క్షణాలు, జ్ఞాపకాలను అందించిన నీ అద్భుతమైన కెరీర్‌ను అభినందిస్తూ వీడియో సందేశం పంపడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ఈ సందేశం సాగింది. ‘‘2018 ఆస్ట్రేలియా ఓపెన్‌లో నిన్ను కలుసకోవడాన్ని ఎప్పటికీ మరచి పోలేను. టెన్నిస్‌ను దాటుకొని ప్రపంచం నలుమూలల నుంచి నీకు లభిస్తున్న మద్దతు, సంఘీభావం.. నేను మరే అథ్లెట్‌ విషయంలో చూడలేదు.  నా వరకు నువ్వెప్పుడూ అత్యుత్తమ అటగాడివే’’ అని ఫెదరర్‌ను కోహ్లీ పొగిడారు. ఫెదరర్‌ ఇటీవల లావెర్‌ కప్‌-2022లో అంతర్జాతీయ టెన్నిస్‌ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. విరాట్ సందేశానికి ఫెదరర్‌ స్పందించాడు. ‘‘థ్యాంక్యూ విరాట్. త్వరలో భారత్‌కు రావాలని ఆశిస్తున్నా’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రోజర్‌ పోస్టు పెట్టాడు. 



Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts