Virat Kohli: విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల లిస్ట్‌ చూశారా..?

క్రికెట్‌లో అదరగొట్టేస్తున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పదో తరగతి మార్కుల మెమోను మీరు చూశారా..? లేదా..? అయితే అభిమానుల కోసం విరాట్ తన మార్కుల లిస్ట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టేశాడు.

Published : 30 Mar 2023 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.  ఐపీఎల్‌లో (IPL 2023)  వరుసగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున పదహారో సీజన్‌ కూడా ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 19 ఏళ్ల వయస్సులో 2008లో ఆర్‌సీబీతో జట్టుకట్టిన విరాట్.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ కప్‌ను దక్కించుకోలేకపోయాడు. ఈసారైనా టైటిల్ విజేతగా నిలవాలని బెంగళూరు ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసేలా తన పదో తరగతి మార్కుల జాబితాను విరాట్ కోహ్లీ సోషల్‌ మీడియా వేదికగా పోస్టు చేశాడు. అలాగే ఆ షీట్‌పైన ‘స్పోర్ట్స్‌?’ అంటూ అదనపు సబ్జెక్ట్‌గా పెట్టాడు. 

విరాట్ కోహ్లీ 2004లో పదో తరగతి పాస్‌ అయినట్లు ఆ మెమోలో ఉంది. ఇంగ్లిష్‌లో 83, హిందీలో 75, సోషల్‌  81 మార్కులు రాగా.. మ్యాథ్స్‌లో 51, సైన్స్‌లో 55 మార్కులే వచ్చాయి. మరి క్రీడలు సంగతి ఏంటన్నట్లుగా వదిలేశాడు. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో విరాట్ క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘‘మార్కుల జాబితాలో కనీసం చోటు లేని సబ్జెక్ట్.. ఇప్పుడు ఎక్కువ భాగమవడం విశేషంగా ఉంది’’ అనే కోణంలో రాసుకొచ్చాడు. అయితే మార్కుల షీట్‌ మీద స్పోర్ట్స్‌ అనే పదం ఉన్న పోస్టును డిలీట్‌ చేసిన విరాట్.. మళ్లీ మెమోను షేర్‌ చేయడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు