క్రీడా స్ఫూర్తికి సలామ్‌: రూట్‌కు కోహ్లీ సాయం

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ మైదానంలో మరోసారి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ తిమ్మిర్లతో ఇబ్బంది పడుతుండగా అతడికి సాయపడ్డాడు. నేలపై పడుకున్న రూట్‌ కాళ్లను పైకి లేపాడు. బూట్ల వద్ద పట్టుకొని రూట్‌ ఇబ్బందిని తొలగించాడు. బీసీసీఐ పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది....

Published : 05 Feb 2021 20:20 IST

రూట్‌ కాలి తిమ్మిర్లు పోగొట్టిన టీమ్‌ఇండియా సారథి 

చెన్నై: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ మైదానంలో మరోసారి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ తిమ్మిర్లతో ఇబ్బంది పడుతుండగా అతడికి సాయపడ్డాడు. నేలపై పడుకున్న రూట్‌ కాళ్లను పైకి లేపాడు. బూట్ల వద్ద పట్టుకొని రూట్‌ ఇబ్బందిని తొలగించాడు. బీసీసీఐ పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చెపాక్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్‌ (128; 197 బంతుల్లో 14×1, 1×6) అజేయ శతకం బాదేశాడు. టీమ్‌ఇండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. స్వీప్‌ షాట్‌ను ఉపయోగించి పరుగులు చేశాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూనే వేగంగా సింగిల్స్‌ తీశాడు. తన వందో టెస్టులో చిరస్మరణీయ శతకం అందుకున్నాడు.

తొలి రోజు 87 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత జోరూట్‌ కాళ్లు తిమ్మిర్లు పట్టాయి. దాంతో అతడు పరుగెత్తుకుంటూ వచ్చి మైదానంలో కూలబడ్డాడు. కాళ్లు పైకి లేపలేకపోయాడు. ఆ సందర్భంలో విరాట్‌ కోహ్లీ అతడిని సమీపించాడు. రూట్‌ కాలిని పైకి లేపి అతడికి సాయపడ్డాడు. అప్పుడు రూట్‌ 192 బంతుల్లో 127 పరుగులతో ఉన్నాడు.

రూట్‌ తమ జట్టును ఇబ్బంది పడుతున్నప్పటికీ విరాట్‌ కోహ్లీ చూపిన క్రీడాస్ఫూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ల నుంచి సామాన్య నెటిజన్ల వరకు ప్రశంసిస్తున్నారు. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు ఎంఎస్‌ ధోనీ ఇలాగే సాయపడ్డాడని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. 2019 ప్రపంచకప్‌ సమయంలో స్టీవ్‌స్మిత్‌కు అండగా నిలిచినందుకు కోహ్లీకి ఐసీసీ క్రీడాస్ఫూర్తి పురస్కారం బహూకరించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
చెపాక్‌లో ‘రూట్‌’ వేశాడు!
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని