‘పంత్ వ్యూహం’ కోహ్లీదే

ఆస్ట్రేలియా సిరీసులో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌ను ముందుగా పంపించడంలో తన ఘనతేమీ లేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ ప్రతిపాదనను

Published : 26 Jan 2021 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా సిరీసులో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌ను ముందుగా పంపించడంలో తన ఘనతేమీ లేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చాడని పేర్కొన్నాడు. అజింక్య రహానె, రవిశాస్త్రి ఇందుకు మొగ్గుచూపారని వెల్లడించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌ గురించి అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్లో రాఠోడ్‌ పలు విషయాలు పంచుకున్నాడు. 

‘‘అది నా నిర్ణయం కాదు. పంత్‌ను ముందుకు పంపించినందుకు నేను ఘనత తీసుకోను. అడిలైడ్‌లో తొలి టెస్టు ఓడిపోవడంతో ఈ చర్చ మొదలైంది. విరాట్‌, అజింక్యతో పాటు మేమంతా కలిసి మాట్లాడుకున్నాం. కోహ్లీనే ఈ ఆలోచనను ముందుగా పంచుకున్నాడు. ఇద్దరు ఎడమచేతివాటం ఆటగాళ్లను తీసుకుంటే పంత్‌ను ఐదో స్థానంలో పంపిస్తే బాగుంటుందని అన్నాడు. అలాగైతే కుడి-ఎడమ కూర్పును కొనసాగించొచ్చు’’ అని విక్రమ్‌ తెలిపాడు.

‘‘మేం మరికొంత సమయం ఆగాం. ఆరో స్థానంలోనే పంపిద్దామని రహానెతో చర్చించాం. అయితే సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో..‘ఇదే సరైన సమయమని, అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిచాల’ని చెప్పాను. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించారు. రవిశాస్త్రి దానికి ఎంతో మద్దతు ఇచ్చాడు. ఆయన ఎడమ-కుడి వాటం భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు తీవ్రతతో బౌలింగ్ చేయలేరని విశ్వసిస్తాడు’’ అని విక్రమ్‌ పేర్కొన్నాడు. సిడ్నీ, బ్రిస్బేన్‌ టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, రెండో ఇన్నింగ్స్‌లో అయిదో స్థానంలో బరిలోకి దిగాడు. ఛేదనలో వరుసగా 97, 89* పరుగులు చేశాడు.

ఇవీ చదవండి

కోహ్లీ అలా చేసేసరికి కన్నీళ్లు వచ్చాయి

శార్దూల్‌, సిరాజ్‌ రచించిన గబ్బా బౌలింగ్‌ వ్యూహం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని