సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు: కోహ్లీ

సంకల్పం ఉంటే ఎక్కడైనా సాధన చేయొచ్చని టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అంటున్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ కోసం కోహ్లీ బయోబబుల్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లతో కలిసి చెన్నైలోని లీలా ప్యాలేస్ హోటల్లో...

Published : 29 Jan 2021 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంకల్పం ఉంటే ఎక్కడైనా సాధన చేయొచ్చని టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అంటున్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ కోసం కోహ్లీ బయోబబుల్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లతో కలిసి చెన్నైలోని లీలా ప్యాలేస్ హోటల్లో క్వారంటైన్‌లో ఉంటున్నాడు. అయితే క్వారంటైన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరూ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంది. దీంతో ఈ సమయాన్ని కోహ్లీ తన ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నాడు.

గదిలోనే శారీరక కసరత్తులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతాన్ని వింటూ వేగంగా సైక్లింగ్ చేస్తున్నాడు. ‘క్వారంటైన్‌ రోజుల్లో మంచి సంగీతం, జిమ్‌ పరికరాలు అవసరం. సంకల్పం ఉంటే ఎక్కడైనా మనకి కావాల్సింది చేయొచ్చు’ అని వీడియోకి వ్యాఖ్య జత చేశాడు. కాగా, ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్‌ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి భారత ఆటగాళ్లు సాధన మొదలుపెడతారు.

ఇవీ చదవండి

పఠాన్‌.. పాక్‌పై నీ హ్యాట్రిక్‌ ఇంకా గుర్తుంది

రబాడ సాధించేది తల్చుకుంటే భయమేస్తుంది


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts