Virat Kohli: విరాట్ కొత్త టాటూ.. అర్థమేంటో చెప్పేసిన టాటూ ఆర్టిస్ట్

చేతికి కొత్త పచ్చబొట్టుతో విరాట్ కోహ్లీ నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మరి ఆ టాటూ అర్థం ఏంటో కూడా అభిమానులు తెలుసుకునే పనిలో పడిపోయారు.

Updated : 02 Apr 2023 18:05 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)  టాటూలను బాగా ఇష్టపడతాడని మనందరికీ తెలుసు. ఇటీవల కొత్త టాటూతో అభిమానులకు కనిపించాడు. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్‌కు ముందు తన చేతి మీద కొత్తగా టాటూ వేయించుకున్నాడు. మరి అతడి చేతి మీద వేయించుకున్న టాటూ అర్థం ఏంటనే దానిపై అందరిలోనూ ఆసక్తి కలిగిస్తొంది. ఈ క్రమంలో కోహ్లీ వేయించుకున్న టాటూ అర్థం ఏంటో టాటూ ఆర్టిస్ట్‌ వెల్లడించారు. కింగ్ కోహ్లీ కొత్త టాటును ఏలియన్స్ టాటూ సంస్థ యజమాని సన్నీ భానుషాలితో వేయించుకున్నాడు. కొన్నేళ్ల కిందట విరాట్ కోహ్లీ తన ఆఫీస్‌కు వచ్చాడని, టాటూలతో కూడిన ఫొటోలను చూపించాడని గుర్తు చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఫాలో అవుతున్నట్లు కోహ్లీ చెప్పాడని పేర్కొన్నారు. 

‘‘ విరాట్ కోహ్లీ చెప్పిన మాటలకు.. మా టాటూ వర్క్‌కు అభిమానిగా మారిపోయాడని నేను భావించా. అతడి ఫేమ్‌ను కూడా పక్కన పెట్టి ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. ఎలాంటి ఓవర్ యాటిట్యూడ్‌ లేకుండా మమ్మల్ని అభినందించాడు. అప్పుడే టాటూ వేయించుకుంటానని చెప్పాడు. అయితే, బిజీ షెడ్యూల్‌తో చాలా రోజులపాటు కుదరలేదు. గత నెలలోనే విరాట్ మళ్లీ కలిశారు. తన పాత టాటూను కవర్‌ చేసేలా కొత్తది వేయాలని సూచించాడు. తన ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా ఉండాలని చెప్పాడు. జీవిత చక్రం మొత్తం అందులో కనిపించాలని కోరాడు. పచ్చబొట్టులో అతడి అంతరంగం ఉండాలని కోరుకున్నట్లు నాకు అనిపించింది. డిజైన్‌ కోసం మనస్ఫూర్తిగా కష్టపడ్డా. ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా ఉండేందుకు తీవ్రంగా శ్రమించా’’ అని తెలిపారు. టాటూ వేయించుకునే క్రమంలో స్టూడియోను పూర్తిగా మూసి వేయించి మరీ కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు