Virat Kohli: టీ20 కెప్టెన్‌గా కోహ్లి చివరిసారి.. 

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన టీమ్‌ఇండియా నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో సోమవారం నమీబియాతో తలపడనుంది. 

Updated : 08 Nov 2021 03:35 IST

నేడు నమీబియాతో భారత్‌ పోరు

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన టీమ్‌ఇండియా నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో సోమవారం నమీబియాతో తలపడనుంది. ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన కోహ్లీకి.. పొట్టి క్రికెట్లో సారథిగా ఇదే చివరి మ్యాచ్‌. కోచ్‌గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్‌. సెమీస్‌ దారులు మూసుకుపోవడంతో నిరాశచెందిన భారత జట్టు.. ఆదివారం ఐచ్ఛిక ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. జట్టు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఎందుకంటే 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్‌ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. ఇక నమీబియాపై భారత్‌ పెద్ద విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని రాహుల్‌ చాహర్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించవచ్చు.  నమీబియాతో భారత్‌కు ఇదే తొలి టీ20 మ్యాచ్‌. ఈ జట్లు గతంలో ఒకే ఒక్కసారి (2003 వన్డే ప్రపంచకప్‌) తలపడ్డాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో నమీబియా.. స్కాట్లాండ్‌ను మాత్రమే ఓడించగలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని