IND VS AUS: భారత్ గెలవాలంటే కోహ్లీ పరుగులు చేయాల్సిందే: హర్భజన్‌ సింగ్

ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ (Virat Kohli) పరుగులు చేయాల్సిందేనని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు.

Published : 08 Feb 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలంటే స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) పరుగులు చేయాల్సిందేనని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) అన్నాడు. ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్‌ మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. 

‘విరాట్‌ కోహ్లి లాంటి ఆటగాడిని ఎంత పొగిడినా తక్కువే. అతడు చాలా పరుగులు చేశాడు. కానీ, కోహ్లీ సెంచరీ చేసినప్పుడే అతడు ఫామ్‌లో ఉన్నాడని మనం భావిస్తుంటాం. అయితే, గత మూడేళ్లుగా అతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం విరాట్‌ వన్డేల్లో ఫామ్‌ అందుకున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. గత రెండేళ్ల నుంచి కూడా అతడు పరుగులు చేస్తున్నాడు. కానీ, సెంచరీలు సాధించలేదు. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీతో టెస్టుల్లో కూడా తిరిగి ఫామ్‌ని అందిపుచ్చుకుని భారీగా పరుగులు చేస్తాడని భావిస్తున్నా. ఫామ్‌లో ఉన్నప్పుడు కోహ్లీని ఆపడం చాలా కష్టం. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించాలంటే విరాట్ పరుగులు చేయాల్సిందే. అతడి నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తున్నాం’ అని హర్భజన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు