WTC Final: కోహ్లీకి ఇబ్బందులు తప్పవు!

సౌథాంప్టన్‌లో పరిస్థితులు స్వింగ్‌, సీమ్‌కు అనుకూలిస్తే టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవని న్యూజిలాండ్‌ మాజీ సారథి గ్లెన్‌ టర్నర్‌ అన్నాడు.....

Published : 08 Jun 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌథాంప్టన్‌లో పరిస్థితులు స్వింగ్‌, సీమ్‌కు అనుకూలిస్తే టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవని న్యూజిలాండ్‌ మాజీ సారథి గ్లెన్‌ టర్నర్‌ అన్నాడు. సారథి విరాట్‌ కోహ్లీతో పాటు బ్యాట్స్‌మెన్‌ అంతా శ్రమించాల్సి వస్తుందన్నాడు. గతంలో న్యూజిలాండ్‌కు వచ్చిన ఆ జట్టు తమ పేసర్ల ధాటికి తట్టుకోలేకపోయిందని వెల్లడించాడు.

‘విరాట్‌ కోహ్లీ ఇబ్బందుల గురించి చెప్పాలని అనుకోవడం లేదు. పిచ్‌, పరిస్థితులు సీమ్‌, స్వింగ్‌కు అనుకూలిస్తే మాత్రం అతడు ఇబ్బంది పడతాడు. అతడితో పాటు ఇతర బ్యాట్స్‌మెన్‌కూ తిప్పలు తప్పవు. న్యూజిలాండ్‌లో గతంలో ఇదే జరిగింది. అందుకే మరోసారీ పరిస్థితులే కీలకం కానున్నాయి’ అని టర్నర్‌ అన్నాడు.

‘ఏదేమైనా ఆటగాడి బ్యాటింగ్‌ టెక్నిక్‌, నైపుణ్యాల్లో సొంతదేశం పరిస్థితుల ప్రభావం ఉంటుందనడం నిజం. ఈ మధ్యకాలంలో భారత్‌లో పిచ్‌లు సీమ్‌కు అనుకూలిస్తున్నా న్యూజిలాండ్‌ పరిస్థితులతో పోల్చలేం. గత పర్యటనలో టీమ్‌ఇండియా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే బయటపడింది. ఇంగ్లాండ్‌ పరిస్థితులు సాధారణంగా న్యూజిలాండ్‌ తరహాలో ఉంటాయి’ అని టర్నర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని