Virat kohli : ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రేమను చాటుకున్న విరాట్‌..

నాలుగో టెస్టు ముగిసిన అనంతరం విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రేమను చాటాడు. తన జెర్సీలను బహుమతిగా అందించాడు.

Published : 14 Mar 2023 18:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆటతోనే కాకుండా.. మైదానంలో మంచి మనసుతో ఆకట్టుకుంటుంటాడు పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli). బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోని చివరి టెస్టులో విరాట్‌ తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 వందల రోజుల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు నమోదు చేసిన శతకం ఇది. ఇక టెస్టు డ్రాగా ముగియగానే.. ప్రత్యర్థి ఆటగాళ్లపై విరాట్‌ చూపించిన ప్రేమ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆట ముగియగానే ఆసీస్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా, వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కెరీల వద్దకు విరాట్‌ వెళ్లాడు. వారిని పలకరించి.. తన జెర్సీలను బహుమతిగా అందించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. విరాట్‌ ప్రవర్తనను క్రికెట్‌ అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 186 పరుగులు చేసి.. టెస్టుల్లో 28వ శతకం నమోదు చేయగా.. అన్ని ఫార్మాట్లలో చేసిన శతకాల సంఖ్య 75కు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని