‘ఒలింపిక్స్‌లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్‌ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్‌

ఇటీవల టీమ్‌ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన వ్యాఖ్యలకు విరాట్‌ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 07 Jul 2024 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభినందించారు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) సహా ప్లేయర్లతో మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్రవిడ్‌ చేసిన వ్యాఖ్యలకు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘గతంలో క్రికెటర్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. కానీ, ప్రస్తుతం ఈ ఆట అందులో భాగమైంది. ఈ విషయం మాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇందుకు ఎంతో గర్వ పడుతున్నాం. ఆ టోర్నీల్లో బాగా రాణించగలం. 2028లో లాస్‌ఏంజెల్స్‌ జరగనున్న ఒలింపిక్స్‌లో భారత్‌ జట్టు తరఫున రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ పాల్గొంటారు. అందులో వారు రాణించగలరని ఆశిస్తున్నా’’ అని ప్రధాని మోదీతో రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పారు.

రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌..!

ఆ వ్యాఖ్యలకు స్పందించిన విరాట్‌ కోహ్లీ తల కిందకు దించుకుని కాసేపు నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీను గెలుచుకున్న అనంతరం రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని