Virat Kohli : నువ్వు వందశాతం కృషి చేశావు.. ఇదొక విచారకరమైన రోజు

 భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. దీంతో అన్ని ఫార్మాట్ల ...

Updated : 16 Jan 2022 15:39 IST

విరాట్ కోహ్లీ నిర్ణయంపై స్పందించిన మాజీలు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్యం నుంచి కోహ్లీ తప్పుకొన్నట్లే. ఈ క్రమంలో కోహ్లీ నిర్ణయంపై మాజీలు సహా క్రీడా ప్రపంచం స్పందించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌, వసీం జాఫర్, జై షా తదితరులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. విరాట్ నిర్ణయం తననెంతో షాక్‌కు గురి చేసిందని భారత వన్డే, టీ20 జట్టు సారథి రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 

అది విరాట్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం . దానిని బీసీసీఐ గౌరవిస్తుంది. కోహ్లీ నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలో అద్భుత విజయాలను టీమ్‌ఇండియా నమోదు చేసింది - సౌరభ్‌ గంగూలీ 

సారథిగా అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీకి కంగ్రాట్యులేషన్స్‌. నువ్వు జట్టు కోసం వందశాతం కృషి చేశావు. భవిష్యత్తులోనూ మంచి జరగాలని ఆశిస్తున్నా - సచిన్‌ 

కెప్టెన్‌గా నువ్వు సాధించిన దానికి తల ఎత్తుకుని వెళ్లొచ్చు. అత్యంత దూకుడైన నీ నాయకత్వంలో భారత్‌ జట్టు విజయవంతమైంది. వ్యక్తిగతంగా ఇది నాకు అత్యంత విచారకరమైన రోజు - రవిశాస్త్రి

టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో భారత్‌ సూపర్‌ విక్టరీలను సాధించింది. ఇప్పుడు (దక్షిణాఫ్రికా మీద) సిరీస్‌ కోల్పోయినందుకు బాధగా ఉంది. అయినా భారత టెస్టు క్రికెట్‌ కోసం ఎంతో చేశావు - వసీం జాఫర్‌

నాకైతే ఆశ్చర్యం కలగలేదు. విదేశాల్లో టెస్టు సిరీస్‌ ఓడిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఓ  కెప్టెన్‌గా నాకూ అనుభవమే. బోర్డు అధికారుల నుంచి క్రికెట్ అభిమానుల వరకు సహించలేరు. కెప్టెన్‌ ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది - సునిల్ గావస్కర్











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని