Virat Kohli: ఆ విషయంలో కోహ్లీది తెలివైన నిర్ణయం: రవిశాస్త్రి

అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయి బ్యాటర్‌గా మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరికినట్లయిందని పేర్కొన్నాడు...

Published : 25 Mar 2022 01:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయి బ్యాటర్‌గా మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరికినట్లయిందని పేర్కొన్నాడు.

‘నిజం చెప్పాలంటే.. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్‌గా తన భుజాలపై ఉన్న భారాన్ని దించుకున్నాడు. ప్రస్తుతం, అతడు మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరికింది. కోహ్లీ మరికొంత కాలం టెస్టు కెప్టెన్‌గా కొనసాగి ఉంటే బాగుండేది. ఏదేమైనా అది అతడి వ్యక్తిగత విషయం. దాన్ని మనమంతా గౌరవించాల్సి ఉంది క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న భారత్‌లో అన్ని ఫార్మాట్ల పగ్గాలను చేపట్టడం అంత సులభమేం కాదు. వేరే ఏ జట్టు కెప్టెన్‌పై లేనంత ఒత్తిడి భారత కెప్టెన్‌పై ఉంటుంది. ఎందుకంటే భారత జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడు జట్టును నడిపిస్తున్నప్పుడు అంచనాలు మరింత పెరిగిపోతుంటాయి’ అని రవిశాస్త్రి అన్నాడు.

‘కోహ్లీ తన వ్యక్తిగత ప్రదర్శన గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్ అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా.? మిడిలార్డర్‌లో ఆడతాడా.? అనే విషయాలు జట్టు బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది’ అని రవిశాస్త్రి అన్నాడు. మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి నేతృత్వంలో కోహ్లీ కెప్టెన్‌గా టెస్టు ఫార్మాట్లో గొప్ప విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని