Virat Kohli: బ్రాండ్‌ విలువలో విరాట్‌దే అగ్రస్థానం

అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగిన భారత ప్రముఖుల జాబితాలో స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2023లో తన బ్రాండ్‌ విలువను రూ.1899 కోట్లకు పెంచుకున్న విరాట్‌.. నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడని కన్సల్టన్సీ సంస్థ క్రాల్‌ తన నివేదికలో పేర్కొంది.

Published : 19 Jun 2024 04:08 IST

ముంబయి: అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగిన భారత ప్రముఖుల జాబితాలో స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2023లో తన బ్రాండ్‌ విలువను రూ.1899 కోట్లకు పెంచుకున్న విరాట్‌.. నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడని కన్సల్టన్సీ సంస్థ క్రాల్‌ తన నివేదికలో పేర్కొంది. 2022తో పోలిస్తే ఈ స్టార్‌ క్రికెటర్‌ బ్రాండ్‌ విలువ 29 శాతం పెరిగింది. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.1692 కోట్లు)ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. మరో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ రూ.1006 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 2020లోనూ కోహ్లి ఈ జాబితాలో నంబర్‌వన్‌ అయ్యాడు. ఇప్పటితో పోలిస్తే అప్పుడు అతడి బ్రాండ్‌ విలువ 9.8 శాతం ఎక్కువ. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్‌ ధోని (రూ.798 కోట్లు), సచిన్‌ తెందుల్కర్‌ (రూ.761 కోట్లు) వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు