Virender Sehwag: సెహ్వాగ్‌ ‘వడాపావ్‌’ ట్వీట్‌.. రోహిత్‌ అభిమానుల ఆగ్రహం..!

టీ20 లీగ్‌లో గతరాత్రి ముంబయిపై కోల్‌కతా విజయం సాధించడంతో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ‘వడాపావ్‌’ పేరిట చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది...

Published : 08 Apr 2022 01:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 లీగ్‌లో గతరాత్రి ముంబయిపై కోల్‌కతా విజయం సాధించడంతో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ‘వడాపావ్‌’ పేరిట చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అది ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులకు నచ్చకపోవడంతో వైరల్‌గా మారి విషయం పెద్దదైంది. దీంతో సెహ్వాగ్‌ ఆ విషయంపై స్పష్టతనిస్తూ మరో ట్వీట్‌ చేశాడు. అసలేం జరిగిందంటే.. బుధవారం రాత్రి ముంబయి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) దంచికొట్టడంతో ఒక్క ఓవర్‌లోనే 35 పరుగులు సాధించి కోల్‌కతాను గెలిపించాడు.

ఈ కమ్రంలోనే అతడు 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసుకొని ఈ టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 2018లో 14 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి కమిన్స్‌ కన్నా ముందున్నాడు. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్‌.. కోల్‌కతా, ప్యాట్‌ కమిన్స్‌ను అభినందిస్తూ వడాపావ్‌ పేరుతో ఓ ట్వీట్‌ చేశాడు. అందులో ఆ జట్టు సాధించిన విజయం.. ముంబయి టీమ్‌ నుంచి వడాపావ్‌ను లాగేసుకున్నట్లు ఉందంటూ తనదైన శైలిలో హాస్యం జోడించి సరదాగా ట్వీట్‌ చేశాడు. అయితే, ఇది రోహిత్‌ శర్మ అభిమానులకు నచ్చలేదు. అది వివాదాస్పదం కావడంతో సెహ్వాగ్‌ మరో ట్వీట్‌ చేశాడు. తన ఉద్దేశం ముంబయిని కించపర్చడం కాదని వివరణ ఇచ్చాడు. అలాగే తాను రోహిత్‌కు వాళ్లకన్నా వీరాభిమానినని చెప్పుకొచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు