Virender Sehwag: పాక్‌ రాజకీయ విశ్లేషకుడికి అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన సెహ్వాగ్‌

మైదానంలో సిక్సర్లు, బౌండరీల మాదిరే సామాజిక మాధ్యమాల్లో వీరేందర్‌ సెహ్వాగ్‌ పోస్టులు అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా ట్విటర్‌లో తనదైన శైలిలో రెచ్చిపోతుంటాడు...

Published : 13 Aug 2022 01:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైదానంలో సిక్సర్లు, బౌండరీల మాదిరే సామాజిక మాధ్యమాల్లో వీరేందర్‌ సెహ్వాగ్‌ పోస్టులు అభిమానులను అలరిస్తాయి. అవకాశం దొరికినప్పుడల్లా ట్విటర్‌లో తనదైన శైలిలో రెచ్చిపోతుంటాడు. తాజాగా ఓ పాకిస్థాన్‌ రాజకీయ విశ్లేషకుడిని వీరూ ఆటాడుకున్నాడు. అతడు భారత్‌ను తక్కువ చేసేలా చేసిన ట్వీట్‌లో పెద్ద తప్పు దొర్లడంతో వీరూ తనదైన శైలిలో చురకలంటించాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ క్రీడల్లో పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ అనే పాక్‌ జావెలిన్‌ త్రోయర్‌ 90.18 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఇందులో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా పాల్గొనలేదు. ఈ పోటీల్లో పాక్‌ అథ్లెట్‌ పసిడిని సొంతం చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు జైద్‌ హమిద్‌ పాక్‌ అథ్లెట్‌ను కొనియాడుతూ.. నీరజ్‌ చోప్రాను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. అయితే, ఇక్కడే అతడు పెద్ద తప్పు చేశాడు. తన వ్యాఖ్యల్లో నీరజ్‌ చోప్రా పేరుకు బదులు ఆశిశ్‌ నెహ్రా పేరును రాసుకొచ్చాడు. ‘అర్షద్‌ నదీమ్‌ సాధించిన ఈ విజయం మరింత మధురంగా ఉండటానికి కారణం భారత జావెలిన్‌ త్రో హీరో ఆశిశ్‌ నెహ్రా రికార్డును బద్దలుకొట్టడం. ఇంతకుముందు జరిగిన ఈవెంట్‌లో ఆశిశ్‌.. అర్షద్‌ను ఓడించాడు’ అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన సెహ్వాగ్‌ ఆ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను పంచుకొని.. ‘చిచ్చా.. ఆశిశ్‌ నెహ్రా ప్రస్తుతం యూకే ప్రధాన మంత్రి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కాబట్టి మీరు చిల్‌ అవ్వండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేశాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts