Sehwag: టెస్టులు, వన్డేలను వదిలేసి టీ20 క్రికెట్‌నే ముందుకు తీసుకెళ్లలేం: సెహ్వాగ్
టెస్టులు, వన్డేలను వదిలేసి.. టీ20 ఫార్మాట్‌ను మాత్రమే ముందుకు తీసుకెళ్లలేమని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో వన్డే ఫార్మాట్‌ను రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత ఈ వాదనలు ఎక్కువ కావడం గమనార్హం. ఎందుకంటే ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు అభిమానుల ఆదరణ కరువైంది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులు లేక స్టేడియాలు బోసిపోయాయి. ఈ అంశంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. టెస్టులు, వన్డేలను అలాగే వదిలేసి.. టీ20 ఫార్మాట్‌ను మాత్రమే ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశాడు.
‘‘టీ20 ఫార్మాట్‌ను మాత్రమే ముందుకు తీసుకెళ్లడాన్ని నేను అంగీకరించను. టెస్టు, వన్డే క్రికెట్లు అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆ ఫార్మాట్లను కూడా ఆడేలా ఐసీసీ చూస్తుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్‌లను నిర్వహిస్తుంది. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో టెస్టులు, వన్డేలు చాలా కీలకం’’ అని సెహ్వాగ్ విశ్లేషించాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లు రావడంతో ఆటగాళ్లు ఆర్థికంగా బలపడుతున్నారని పేర్కొన్నాడు.‘నాకు తెలిసి క్రికెట్ ఆడేందుకు ఇదే మంచి సమయం. ఒకవేళ మీరు దేశం తరఫున ఆడకపోయినా ఈ టీ20 లీగ్‌ల్లో ఆడొచ్చు. ఈ లీగ్‌లు మీకు (ఆటగాళ్లకు) ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: టామ్ అండ్ జెర్రీల అదితి- దుల్కర్.. హెబ్బా పటేల్ లెహంగా అదుర్స్!
-
World News
Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు