Sehwag - Saha : వృద్ధిమాన్‌ సాహా.. నీ వెంటే ఉంటాం: సెహ్వాగ్

టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు...

Published : 21 Feb 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు డాషింగ్‌ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మద్దతుగా నిలిచాడు. ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్తు తీవ్ర ఒత్తిడి తెచ్చాడని సాహా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లను షేర్‌ చేశాడు. అయితే ఇంటర్వ్యూ కోసం స్పందించకపోయేసరికి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని సాహా పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్‌ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది’ అని సాహా విచారం వ్యక్తం చేశాడు.

సాహా వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ‘‘ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. కేవలం చెంచాగిరి చేసేవాడు మాత్రమే ఎవరితోనూ గౌరవించబడడు. అసలు పాత్రికేయుడే కాదు. నీతోనే ఉంటాం వృద్ధిమాన్‌’’ అని ట్వీట్ చేశాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాహాను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో వృద్ధిమాన్‌ సాహా మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రిటైర్‌మెంట్ గురించి ఆలోచించాలని సూచించాడని సాహా తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని