Updated : 24 May 2022 09:43 IST

Virender Sehwag: అప్పుడు జహీర్‌, నెహ్రాను చూశా.. ఇప్పుడు అర్ష్‌దీప్‌: సెహ్వాగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంపై మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్‌సింగ్‌ ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లే తీసినా ఎకానమీ 7.70గా నమోదైంది. దీంతో టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీ వచ్చేనెల దక్షిణాప్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అతడి బౌలింగ్‌పై సెహ్వాగ్‌ ఓ క్రీడా ఛానల్‌తో స్పందించాడు.

‘ఈసారి అర్ష్‌దీప్‌ నన్నెంతగానో ఆకట్టుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లలో రెండు అతడే బౌలింగ్‌ చేశాడు. అతడి ఖాతాలో ఎక్కువ వికెట్లు లేకపోయినా ఎకానమీ అద్భుతంగా ఉంది. ఒక బౌలర్‌ కొత్త బంతితో ఒక ఓవర్‌.. తర్వాత పాత బంతితో డెత్‌ ఓవర్లలో రెండు ఓవర్లు వేయడం నేను ఆడేటప్పుడు జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రాల వద్ద  మాత్రమే చూశాను. ఇప్పుడు అర్ష్‌దీప్‌, బుమ్రా, భువనేశ్వర్‌ లాంటి వాళ్లు అలా బౌలింగ్‌ చేస్తున్నారు. ఏ బౌలర్‌కైనా ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌ చేయడం చాలా కష్టమైన పని. కానీ, అర్ష్‌దీప్‌ దాన్ని సులభంగా చేశాడు’ అని సెహ్వాగ్‌ మెచ్చుకున్నాడు.

మరోవైపు హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంపై మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌, మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ఖాన్‌ స్పందించారు. అతడు టెస్టు జట్టులో ఉండేందుకు అర్హుడని.. అవకాశాలు ఇవ్వాలని అజహరుద్దీన్‌ కోరాడు. అతడికి మెరుగైన శిక్షణ ఇచ్చి మరింత రాటుదేలేలా చేయాలన్నాడు. ఇక హైదరాబాద్‌ టీమ్‌ ఆదివారం తమ లీగ్‌ దశను పూర్తి చేసుకోవడంతో ఇంటిముఖం పట్టింది. అయితే, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టుకు ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌ తన మెంటార్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను కలిశాడు. ఈ సందర్భంగా పఠాన్‌ అతడితో కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. జమ్మూలో ఉమ్రాన్‌కు ఇర్ఫాన్‌ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని