Bumrah - Broad : బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు.. నెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ చమక్కు

యువరాజ్‌ను గుర్తుకు తెస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో చెలరేగిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌పై..

Published : 04 Jul 2022 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్: యువరాజ్‌ను గుర్తుకు తెస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో చెలరేగిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన సరదా ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఈ ఓవర్‌లో మొత్తం 35 పరుగులు వచ్చాయి. అందులో 29 రన్స్‌ను బుమ్రా బాదేయగా.. మరో ఆరు అదనపు పరుగుల రూపంలో వచ్చి చేరాయి. ఈ క్రమంలో ఓవర్‌ ముగిశాక స్టువర్ట్‌ బ్రాడ్‌ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో సెహ్వాగ్‌ తమాషా ట్వీట్‌ చేశాడు. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆటోమేటిక్‌గా ఎలా చిక్కుకున్నానో నాకైతే తెలియదు’’ అంటూ మీమ్‌ క్రియేట్‌ చేసి పెట్టాడు. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 36 వేల లైకులు రాగా.. 2వేలకుపైగా రీట్వీట్‌లు చేశారు. కామెంట్లతో చెలరేగిపోయారు. మరి అదేంటో మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని