Ashwin: చెస్‌ ఫ్రాంఛైజీ సహ యజమానిగా అశ్విన్.. విశ్వనాథన్‌ ఆనంద్ హర్షం

 గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో అరంగేట్రం చేయనున్న అమెరికన్‌ గాంబిట్స్‌ జట్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ వాటాలను కొనుగోలు చేశాడు.  

Published : 09 Jul 2024 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చెస్‌ ఫ్రాంఛైజీకీ సహా యజమాని అవ్వడం పట్ల చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్ హర్షం వ్యక్తంచేశాడు. టెక్‌ మహింద్రా, ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెడరేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ చెస్ లీగ్ రెండవ ఎడిషన్‌లో పాల్గొనే కొత్త జట్టైన అమెరికన్‌ గాంబిట్స్‌లో అశ్విన్‌ వాటాలను కొనుగోలు చేశాడు. ‘‘చదరంగం ప్రపంచంలోకి ప్రవేశించిన మీ ఫ్రాంఛైజీకి స్వాగతం. క్రికెట్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మీరు అమెరికన్‌ చెస్‌ లీగ్‌లో అదే స్ఫూర్తిని నింపుతారని ఆశిస్తున్నాను’’ అని విశ్వనాథ్ ఆనంద్‌ ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నాడు. 

అక్టోబరు 3 నుంచి 12 వరకూ జరగనున్న రెండో ఎడిషన్‌ కోసం ఆరు ఫ్రాంఛైజీలను సోమవారం ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త ప్రచుర పీపీ వెంకట్‌ కె.నారాయణ, అశ్విన్‌ యాజమాన్యంలోని అమెరికన్‌ గాంబిట్స్‌ చింగారి టైటాన్స్‌ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ‘‘అమెరికన్‌ గాంబిట్స్‌ను చదరంగ ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అచంచలమైన సంకల్పంతో మా జట్టును పునర్నిర్మించాలని అనుకుంటున్నాం. దీనికి సహా యజమానిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను’’ అని అశ్విన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని