WTC Finals: టీమ్‌ఇండియానే ఫేవరెట్‌

మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడే టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌.. రెండు జట్లూ బలంగా ఉన్నాయని, అయితే కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 06 Jun 2021 11:31 IST

తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేస్తే.. మ్యాచ్‌పై పట్టు : వీవీఎస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడే టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌.. రెండు జట్లూ బలంగా ఉన్నాయని, అయితే కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా సవాళ్లను చూసి భయపడదని, ధైర్యంగా ముందుకు సాగుతుందని చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.

‘ప్రస్తుతం రెండు జట్లూ బాగా ఆడుతున్నాయి. అయితే టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగునుంది. ఎందుకంటే ఆ జట్టు గత రెండు మూడేళ్లుగానే కాకుండా కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తోంది. కోహ్లీసేన సవాళ్లను ఎదుర్కొని, వచ్చిన అవరోధాలను దాటుకొని మరీ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీసే అందుకు ఉదాహరణ. కోహ్లీసేనలో ఇప్పుడు ఎంతో మంది నైపుణ్యమున్న ప్రతిభావంతులు ఉన్నారు. మరోవైపు ఈ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఒక్క మ్యాచే అయినందున ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేస్తుందో అదే జట్టు మ్యాచ్‌పై పట్టుబిగిస్తుంది’ అని లక్ష్మణ్‌ వివరించాడు.

ఇక టీమ్‌ఇండియా ప్రస్తుతం సౌథాంప్టన్‌లో క్వారంటైన్‌లో ఉండగా, న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ జట్టు ఇంగ్లాండ్‌ పరిస్థితులను అర్థం చేసుకునే వీలుందని, అది ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో వారికి కలిసివస్తుందని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని