BCCI: ఎన్సీఏ హెడ్ కోచ్‌ పదవిని తిరస్కరించిన లక్ష్మణ్‌!

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్‌ పదవిని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తిరస్కరించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రావిడ్‌ త్వరలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న..

Published : 18 Oct 2021 23:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్‌ పదవిని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తిరస్కరించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రావిడ్‌ త్వరలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్సీఏ హెడ్‌ పదవి కోసం బీసీసీఐ వర్గాలు లక్ష్మణ్‌ని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పదవీ కాలం.. టీ20 ప్రపంచకప్‌తో ముగియనున్న విషయం తెలిసిందే. 

లక్ష్మణ్‌ ప్రస్తుతం.. దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా, ఎన్సీఏ హెడ్‌ పదవిని లక్ష్మణ్‌ తిరస్కరించడంతో.. బీసీసీఐ మరో మాజీ ఆటగాడిని వెతికే పనిలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టీమిండియా టెస్టు క్రికెట్లో ప్రముఖ స్థానం సంపాదించిన లక్ష్మణ్‌.. 134 టెస్టు మ్యాచుల్లో 8,781 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని