VVS Laxman: అందుకే ఈ విజయం వెరీ వెరీ స్పెషల్‌: లక్ష్మణ్‌

యువ భారత్‌ ప్రపంచకప్‌ సాధించడంపై జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశాడు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలోనూ యవకులు బాగా ఆడారని మెచ్చుకున్నాడు...

Published : 06 Feb 2022 12:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ భారత్‌ ప్రపంచకప్‌ సాధించడంపై జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలోనూ యవకులు బాగా ఆడారని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సెలెక్షన్‌ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ ఈ యువకులను ఎంపిక చేయడం సవాలుతో కూడుకున్నదన్నారు. అలాగే అండర్‌-19 హెడ్‌కోచ్‌ హృషికేష్‌తో పాటు ఇతర సహాయక సిబ్బందిని కూడా ప్రశంసించారు. ఈ యువకులను ఏకతాటిపైకి తెచ్చారని, దాంతో తొలుత ఆసియా కప్‌ తర్వాత ప్రపంచకప్ సాధించారన్నారు.

ఈ టోర్నీ మధ్యలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడినా ఇలా పట్టుదలగా ఆడి జగజ్జేతగా నిలవడం వారి పట్టుదల, అంకిత భావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అలాగే ఆటగాళ్లు ఇలా రాణించడానికి బీసీసీఐ కూడా ప్రధాన కారణమని కొనియాడారు. అయితే, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభించడంతో యువకులకు ఏ టోర్నీ నిర్వహించలెకపోయారని అన్నారు. ఇలాంటి క్లిష్ట సందర్భాల్లోనూ యువకులు గొప్పగా పోరాడారని అభినందించాడు. అందుకే ఈ విజయం చాలా ప్రత్యేకమైందని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని