IND vs AUS: తొలి వార్మప్‌ మ్యాచ్‌.. అదరగొట్టిన రాహుల్‌, సూర్యకుమార్‌

ఆసీస్‌తో మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. అయితే సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు సాధించారు. హార్దిక్‌ పాండ్య విఫలమయ్యాడు. మరి బౌలింగ్‌లో ఏం చేస్తారో చూడాలి.

Published : 17 Oct 2022 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధశతకాలు సాధించారు. అయితే హార్దిక్‌ పాండ్య (2) విఫలం కాగా.. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), దినేశ్ కార్తిక్‌ (20) ఫర్వాలేదనిపించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 6*, రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ 4.. మిచెల్ స్టార్క్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్టన్‌ అగర్ తలో వికెట్ తీశారు. 

రాహుల్ దూకుడు.. 

పెద్ద మైదానమైన బ్రిస్బేన్‌లో భారీ షాట్లు ఆడటం అంత సులువేం కాదు. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. ఆసీస్‌ బౌలింగ్‌ ఏమాత్రం లెక్క చేయకుండా మూడు సిక్స్‌లు బాదేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔట్ కావడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. కానీ విరాట్, సూర్య నిలకడగా ఆడారు. మరోసారి విరాట్‌తోపాటు హార్దిక్‌ వరుసగా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి అర్ధశతకం సాధించాడు. అయితే చివరి ఓవర్‌లో ఔట్ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని