PV Sindhu : పీవీ సింధుకు డేవిడ్‌ వార్నర్‌ స్పెషల్‌ విషెస్‌

తెలుగు తేజం, ఒలింపిక్‌ పతకాల విజేత  పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్మాడ్మింటన్‌ మహిళల సింగిల్స్ విభాగంలో...

Updated : 09 Aug 2022 14:29 IST

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు తేజం, ఒలింపిక్స్‌ పతకాల విజేత  పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్మాడ్మింటన్‌ మహిళల సింగిల్స్ విభాగంలో పసిడి నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. సింధుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశాడు. ‘‘వెల్‌డన్‌ సింధు.. అద్భుతమైన విజయం. పరిపూర్ణం’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. అలానే 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం, 2014 కామన్వెల్త్‌లో సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. తాజాగా స్వర్ణం గెలిచిన సింధు ఫైనల్‌లో కెనడా ప్లేయర్‌ మిచెల్లె లిపై 21-15, 21-13 తేడాతో అలవోకగా విజయం సాధించి పసిడిని కైవసం చేసుకుంది. ప్రస్తుత కామన్వెల్త్‌లో భారత్‌ 61 పతకాలు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు , 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని