ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌’గా డేవిడ్‌ వార్నర్

ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్‌ వార్నర్ నవంబరు నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో డేవిడ్ వార్నర్‌

Updated : 23 Nov 2022 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్‌ వార్నర్ నవంబరు నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో డేవిడ్ వార్నర్‌ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో వార్నర్‌ 49 పరుగులు, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 53 పరుగులతో ఆసీస్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘డేవిడ్ వార్నర్‌ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తన విధ్వంసకర ఆటతీరుతో ఆస్ట్రేలియా జట్టును విజేతగా నిలిపాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 151 కి పైగా స్ట్రైక్‌ రేట్‌తో 209 పరుగులు చేశాడంటే అతడి విధ్వంసం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అతడి స్ట్రోక్‌ ప్లే చూడటానికి చాలా బాగుంటుంది’ అని ఐసీసీ జ్యూరీ మెంబర్ రస్సెల్ ఆర్నాల్డ్ పేర్కొన్నాడు.     

మరోవైపు, వెస్టిండీస్ ఆల్‌ రౌండర్‌ హేలీ మాథ్యూస్‌ ‘ఐసీసీ విమెన్‌ ఆఫ్ ది మంత్‌’గా నిలిచింది. 141 పరుగులతో పాటు 13.11 సగటుతో 9 వికెట్లు పడగొట్టింది. ‘హేలీ.. ఇటు బ్యాటుతోనూ, అటు బంతితోనూ మెరుగ్గా రాణించింది. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టుపై విండీస్ విజయం సాధించేలా చేసింది. అందుకే ‘ఐసీసీ విమెన్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుకు ఆమె అర్హురాలు’ అని ఐసీసీ మరో జ్యూరీ మెంబర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ఐసీసీ ఈ ఏడాది జనవరిలో ‘ప్లేయర్‌ ఆఫ్ ది మంత్‌’ అవార్డుని ప్రవేశ పెట్టింది. మాజీ క్రికెటర్లు, ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, ప్రపంచ క్రికెట్ అభిమానులు వేసే ఓట్ల ఆధారంగా నెలకు ఒక ఉత్తమ ఆటగాడిని ఐసీసీ ఎంపిక చేస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని