
Mohammad Siraj : క్రికెట్‌ను వదిలేసి.. వెళ్లి ఆటో తోలుకోమన్నారు.! : మహమ్మద్ సిరాజ్
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా ప్రధాన పేసర్‌గా రాణిస్తున్న హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్.. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన కష్టాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిర్వహిస్తున్న ‘పాడ్‌కాస్ట్’లో పంచుకున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్లో చేసిన పేలవ ప్రదర్శన తర్వాత.. సామాజిక మాధ్యమాల్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పాడు. కొందరైతే క్రికెట్‌ను వదిలేసి.. వెళ్లి ఆటో తోలుకోమని సలహా ఇచ్చారని పేర్కొన్నాడు.
2019 ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఆడిన 9 మ్యాచుల్లో 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఓ మ్యాచులో సిరాజ్ 2.2 ఓవర్లలోనే ఐదు సిక్సులు సహా 36 పరుగులు ఇచ్చాడు. ఇందులో రెండు బీమర్లు (నేరుగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ అవతల బంతి విసరడం) ఉన్నాయి. ఈ సీజన్లోనే బెంగళూరు జట్టు వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ముగించింది.
* మహీ భాయ్ సలహాతో..
‘కోల్‌కతా జట్టుతో జరిగిన ఆ మ్యాచులో నేను రెండు బీమర్లు వేసిన తర్వాత.. ట్రోలింగ్ మొదలైంది. ‘క్రికెట్ వదిలేసి.. వెళ్లి మీ నాన్నలా ఆటో తోలుకో’అని హేళన చేసేవారు. ఇంకా రకరకాల కామెంట్లు వచ్చాయి. అప్పుడు నాకు టీమ్ఇండియాకు ఎంపికైన కొత్తలో మహీ భాయ్ (మహేంద్ర సింగ్ ధోని) చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ‘బయటి వాళ్లు ఏమన్నా పట్టించుకోకు. నువ్వు మెరుగ్గా రాణిస్తే.. నిన్ను తిట్టిన వాళ్లే పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తారు. విఫలమైతే విమర్శిస్తుంటారు. అందుకే, అలాంటి కామెంట్లను సీరియస్‌గా తీసుకోకు’ అని మహీ భాయ్ చెప్పాడు. ఆ రోజు మహీ భాయ్ చెప్పిన మాటలే నేడు నిజమయ్యాయి. అప్పడు నన్ను తీవ్రంగా విమర్శించిన వాళ్లే.. ఇప్పడు ప్రశంసిస్తున్నారు. ‘నువ్వు గొప్ప బౌలర్‌వి భాయ్’ అని పొగుడుతున్నారని సిరాజ్ చెప్పాడు.
ఒకప్పుడు పేలవ ప్రదర్శన కారణంగా జట్టుకే దూరమయ్యే పరిస్థితి నుంచి.. అదే జట్టులో ప్రధాన బౌలర్ స్థాయికి ఎదిగేందుకు ఎంతో శ్రమించానని సిరాజ్ చెప్పాడు. వచ్చే సీజన్ కోసం బెంగళూరు యాజమాన్యం రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లలో సిరాజ్ పేరు దక్కించుకోవడం గమనార్హం. ఇతడితో పాటు విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్లను కూడా బెంగళూరు రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో.. సుప్రీంకోర్టు ‘లక్ష్మణ రేఖ’ దాటింది..!
-
Business News
Stock Market Update: నష్టాల్లో ముగిసిన సూచీలు.. +600 నుంచి 100కు సెన్సెక్స్
-
Movies News
telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
World News
Sri Lanka: కరెన్సీ ముద్రణ నిలిపే దిశగా శ్రీలంక
-
Business News
Money Management Tips: ఖర్చులు నియంత్రించుకోలేకపోతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
-
Politics News
Raghurama: రైలును తగులబెట్టి నన్ను హత్య చేయాలని చూశారు: ఎంపీ రఘురామ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)