covid : సుందర్‌కు దూరంగా తండ్రి బస
టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కలలను నెరవేర్చేందుకు అతడి తండ్రి ఎం.సుందర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు....
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కలలను నెరవేర్చేందుకు అతడి తండ్రి ఎం.సుందర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి కొవిడ్-19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతడికి దూరంగా మరో ఇంట్లో బస చేస్తున్నారు.
సుందర్ తండ్రి చెన్నై ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో పనిచేస్తారు. ఉద్యోగ రీత్యా వారంలో రెండుమూడు సార్లు ఇంటి గడప దాటక తప్పదు. ఈ నేపథ్యంలో తన ద్వారా కుమారుడికి కరోనా రాకూడదని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. సుందర్ ఐపీఎల్ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి తల్లి, సోదరితో కలిసి ఉంటున్నాడు. తండ్రి మాత్రం మరో ఇంట్లో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.
‘సుందర్ ఐపీఎల్ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి నేను మరో ఇంట్లో ఉంటున్నాను. నా భార్య, కుమార్తె మాత్రం అతడితోనే ఉంటున్నారు. ఎందుకంటే వారు ఇంట్లోంచి బయటకు రారు. నేను వీడియో కాల్స్ ద్వారా వారితో మాట్లాడుతున్నాను. వారంలో కొన్ని రోజులు నేను కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే సుందర్‌కు నా ద్వారా కొవిడ్ రాకూడదని కోరుకున్నా’ అని ఎం.సుందర్ తెలిపాడు.
2018లోనే సుందర్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఒక్క మ్యాచులోనూ అతడికి అవకాశం రాలేదు. లార్డ్స్ సహా ఇంగ్లాండ్ మైదానాల్లో ఆడాలన్నది సుందర్ కోరికల్లో ఒకటి. ముంబయికి చేరుకొనేలోపు వైరస్ సోకితే విమానం ఎక్కే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేయడంతో ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో సుందర్ బ్యాటు, బంతితో రాణించాడు. అప్పట్నుంచి అతడు జట్టులో కీలక సభ్యుడు అయ్యాడు. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీసుకు అతడిని ఎంపిక చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్