Washington Sundar: సుందర్‌ మ్యాజిక్‌ బాల్‌.. క్లీన్‌బౌల్డ్‌ అయిన జోర్డాన్‌ కాక్స్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదగొడుతున్నాడు.

Updated : 18 Aug 2022 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదగొడుతున్నాడు. లంకాషైర్‌ తరఫున ఆడుతూ రాణిస్తున్నాడు. తాజాగా కెంట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తన ఆఫ్‌ స్పిన్ బంతులతో బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 వికెట్లు పడగొట్టి లంకాషైర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెంట్ రెండో ఇన్నింగ్స్‌ 32 ఓవర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌. బ్యాటర్‌ జోర్డాన్‌ కాక్స్‌ బ్యాట్, ప్యాడ్ల మధ్యలో నుంచి ఆఫ్‌ స్టంఫ్‌ను గిరాటేసింది. బ్యాటర్‌ షాక్‌ అవుతూ..చేసేదేమి లేక పిచ్‌వైపు చూస్తూ నిరాశతో పెవిలియన్‌ చేరాడు.సుందర్‌ లంకాషైర్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి 24.75 సగటుతో 8 వికెట్లు పడగొట్టాడు. సుందర్‌ గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. ఫామ్‌ అందుకొని, తిరిగి పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని