Wasim akram: ఇంత గొప్ప ఆటగాడిపై ట్రోలింగ్‌ చేశారు: వసీం ఆక్రమ్‌

పాక్‌ మాజీ దిగ్గజం వసీం ఆక్రమ్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడి ప్రతిభను ఎప్పుడో గుర్తించానన్నాడు.

Published : 05 Nov 2022 01:37 IST

దిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విలువైన క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో జట్టు అతడికి మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ పేసర్‌ ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ దిగ్గజం వసీం అక్రమ్‌ ఈ యువ ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు. 

‘‘అతడి ప్రతిభను నేను, వకార్‌ యూనిస్‌ ఆసియా కప్‌ సమయంలోనే గుర్తించాం. సూపర్‌ 12 దశలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా అర్ష్‌దీప్‌ ఈ టోర్నమెంట్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. కొత్తబంతితో అతడు రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు. భారత టీ20 లీగ్‌లోనూ గొప్పగా ఆడాడని అంతా చెప్తున్నారు. ఈ యువ బౌలర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అతడెంతో తెలివైనవాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతడు వేసిన యార్కర్లు ఆట గమనాన్ని మలుపుతిప్పాయి. భారత్‌లో ఈ ఆటగాడిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ చేశారు. కానీ అతడు ఇవేవీ పట్టించుకోలేదు. ఆటగాడికి కచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఇది’’ అంటూ వసీం తెలిపాడు. బుమ్రా లోటును భర్తీ చేస్తూ జట్టులోకి అడుగుపెట్టిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ప్రపంచ జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా హార్డ్‌, బౌన్సీ పిచ్‌లపై ముందుగానే ప్రాక్టీస్‌ చేసి సన్నద్ధంగా ఉండటం వల్లే మంచి ఫలితాలు రాబడుతున్నట్టుగా ఈ హర్ష్‌దీప్‌ పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని