Wasim Jaffer: ఆసీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ ట్వీట్‌కు వసీంజాఫర్‌ సూపర్‌ పంచ్‌

టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువగా అంచనా వేస్తూ సోషల్‌ మీడియాలో ...

Published : 07 Jan 2022 20:06 IST

 స్టీవ్‌ స్మిత్‌ సగటు కంటే నవ్‌దీప్‌సైనిదే ఎక్కువ

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువగా అంచనా వేస్తూ సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులకు మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అదిరిపోయే కౌంటర్‌ ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇలానే ఓ ట్వీట్‌కు రిట్వీట్ చేసి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఆసీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ బ్యాటింగ్ యావరేజ్‌లను పోలుస్తూ ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టర్‌ ‘7క్రికెట్’ ట్వీట్‌ చేసింది. 2019వ సంవత్సరం నుంచి మిచెల్ స్టార్క్ 38.63 సగటుతో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 37.17గానే ఉందని పేర్కొంది. దీంతో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి ట్రోల్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ నవ్‌దీప్‌ సైని, ఆసీస్‌ టాప్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ వన్డే ఫార్మాట్ బ్యాటింగ్‌ యావరేజ్‌లను వసీం జాఫర్‌ ట్విటర్‌లో పోస్టు చేశాడు. స్మిత్‌ (43.34) కంటే నవ్‌దీప్ సైని (53.50) సగటే ఎక్కువగా ఉందని వ్యంగ్యంగా ట్వీటాడు. మరి అదెంటో మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని