IND vs AUS: ఆసీస్‌ జట్టు బుర్రలో ఇప్పటికే అశ్విన్‌ తిష్ట వేశాడు: జాఫర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లకు ఇదే కీలక సిరీస్‌. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఓటమి తప్పదు. భారత్‌ పిచ్‌లపై అశ్విన్‌ (Ravichandran Ashwin) చాలా ప్రమాదకర బౌలర్‌. అతడిని అడ్డుకొనేందుకు ఆసీస్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

Published : 04 Feb 2023 18:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌తో (Team India) నాలుగు టెస్టుల సిరీస్‌ (IND vs AUS) కోసం ఆస్ట్రేలియా ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. తమ బ్యాటర్లు ప్రాక్టీస్‌ చేసేందుకు అచ్చం రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) తరహాలో బంతులను సంధించే బౌలర్‌ను ఆస్ట్రేలియా (Australia) రప్పించుకొంది. మహీశ్‌ పితియా అనే బరోడా స్పిన్నర్‌తో బంతులను సంధించుకుంటూ ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతోపాటు అశ్విన్‌ ప్రమాదకరంగా మారతాడనే అంచనాతో ఆసీస్‌ ఈ ఏర్పాట్లను చేసుకొంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను ఉడికించేలా టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. 

బోర్డర్‌ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా మరో ఐదు రోజుల్లో నాగ్‌పుర్‌ వేదికగా భారత్ - ఆసీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఐదు రోజులు ముందుగానే రవిచంద్రన్ అశ్విన్‌ ఆసీస్‌ ఆటగాళ్ల తలలోకి దూరిపోయాడని జాఫర్ వ్యాఖ్యానించాడు. ‘‘మొదటి టెస్టుకు ఇంకా ఐదు రోజులే సమయం. అయితే ఇప్పటికే అశ్విన్‌ ఆస్ట్రేలియా బుర్రలోనే ఉండిపోయాడు’’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా పెట్టిన వీడియోను కామెంట్ చేస్తూ జాఫర్ పోస్టు పెట్టాడు. మరోవైపు భారత్‌ కూడా తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో నలుగురు స్పిన్నర్లను నెట్‌ బౌలర్లుగా వినియోగించుకొంటోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని