రబాడా సాధించేది తల్చుకుంటే భయమేస్తుంది

దక్షిణాఫ్రికా పేస్‌బౌలర్‌ కగీసో రబాడ టెస్టుల్లో 200 వికెట్లు సాధించడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ ప్రశంసించాడు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న...

Updated : 29 Jan 2021 15:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పేస్‌బౌలర్‌ రబాడ టెస్టుల్లో 200 వికెట్లు సాధించడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరాచిలో జరుగుతున్న తొలి టెస్టులో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా రబాడ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతడు 197 వికెట్లతో కొనసాగుతుండడంతో ఇప్పుడు 200  మైలురాయి చేరుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసిన వారిలో రబాడా (40.8) అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ కలిగిన బౌలర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.

ఈ విశేషాన్ని తెలియజేస్తూ ఓ క్రీడా సంస్థ పోస్టు చేసిన ట్వీట్‌కు జాఫర్‌ స్పందించాడు. ‘టెస్టుల్లో 200 వికెట్లు తీసిన రబాడాకు అభినందనలు. అది కూడా ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ సాధించిన దిగ్గజాల్లో ఒకడిగా నిలిచాడు. అయితే, ఇప్పుడతడి వయస్సు 25 ఏళ్లే. భవిష్యత్‌లో అతడు సాధించేది ఆలోచిస్తే భయమేస్తుంది’ అని జాఫర్‌ ప్రశంసించాడు.

ఇవీ చదవండి..
ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్‌
పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని ఉంది: పుజారా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు