wasim jaffer: మన్కడింగ్‌పై ఫన్నీ ట్వీట్‌.. వసీం టైమింగ్‌ అదుర్స్‌ అంటోన్న నెటిజన్లు

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌ నవ్వులు పూయిస్తోంది. 

Published : 01 Oct 2022 02:28 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలో భాగంగా టీమ్‌ఇండియా బౌలర్‌ దీప్తి శర్మ చేసిన రనౌట్‌(మన్కడింగ్‌) వివాదాస్పదమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడాస్ఫూర్తి, ఆట నిబంధనలు అనే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు, అక్కడి మీడియా ఈ రనౌట్‌ను తప్పుపడుతుండగా మరికొందరు మాత్రం దీప్తి సమయస్ఫూర్తితో ఆడిందని సమర్థిస్తున్నారు. ఇలా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌ నవ్వులు పూయిస్తోంది. 

ఇటలీకి చెందిన ఓ సైక్లిస్ట్‌ పోటీలో గెలవడానికి శరీరాన్ని బల్లపరుపుగా సైకిల్‌పై ఉంచడం ద్వారా అందరినీ అధిగమిస్తూ దూసుకెళ్తున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. దీన్ని ఉదాహరణగా చూపుతూ.. నిబంధనలు ఉల్లంఘించలేదు కానీ ఇతడు ఈ కిటుకు ఉపయోగించి ఆటలో గెలవడాన్ని తాను ఒప్పుకోనంటూ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను, అక్కడి మీడియాను ఉద్దేశించి వసీం పరోక్షంగా విమర్శించాడు. ‘‘ఓ ఇంగ్లిష్‌ సైక్లిస్ట్‌ మాట్లాడుతూ.. ‘‘నిబంధనల ప్రకారమే ఆడి ఉండవచ్చు. కానీ ఇది సైక్లిస్ట్‌ స్ఫూర్తికి విరుద్ధం.. నేనైతే ఇలా చేయను’’ అన్నాడు’’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకకట్టుకుంటోంది. మన్కడింగ్‌ అంశానికి ఈ వీడియోను ముడిపెడుతూ తెలివిగా తన హాస్యచతురతను ప్రదర్శించడంపై అంతా అతడిని ప్రశంసిస్తున్నారు. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-0 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. 


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని