ఐపీఎల్‌ వేలం గురించి ముందే ఊహించా: ఫించ్‌

ఐపీఎల్‌ వేలంలో తనపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంపై ఆశ్చర్యమేమి కలగలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఫించ్‌ను ఎవరూ తీసుకోని విషయ....

Published : 21 Feb 2021 23:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ వేలంలో తనపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంపై ఆశ్చర్యమేమి కలగలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఫించ్‌ను ఎవరూ తీసుకోని విషయం తెలిసిందే. గత ఐపీఎల్, బీబీఎల్‌ సీజన్లలో అతడి పేలవమైన ప్రదర్శన వేలంలో తీవ్ర ప్రభావం చూపించింది. ఆర్‌సీబీ తరఫున 22, బీబీఎల్‌లో మెల్‌బోర్న్‌కు 13 సగటుతో పరుగులు చేశాడు.

‘‘ఐపీఎల్‌లో ఆడటం ఎంతో బాగుంటుంది. అందులో పోటీ అద్భుతంగా ఉంటుంది. అయితే వేలంలో నన్ను తీసుకోకపోవడం ఊహించనిది ఏమీ కాదు. క్రికెట్‌ ఆడటానికి నేను ఇష్టపడతా. అయితే కాస్త సమయం ఇంట్లో ఉండటం చెడ్డ విషయమేమి కాదు. ఆగస్టు నుంచి క్వారంటైన్‌, బయోబబుల్‌తో బిజీబిజీగా ఉన్నాం. కాబట్టి కొంత సమయం ఇంట్లో ఉండి తిరిగి ఉత్సాహంతో తిరిగొస్తా’’ అని ఫించ్ అన్నాడు. ఆటలో తన టెక్నిక్‌లు మెరుగుపర్చుకుంటానని తెలిపాడు. కాగా, న్యూజిలాండ్‌తో ఆసీస్‌ సోమవారం నుంచి అయిదు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని