Viral Video: ఐ బాబోయ్‌.. ఎంత పొడుగో!!

క్రీడల్లో ఎవరైనా ఎత్తుగా ఉంటే అది వారికి బాగా కలిసివస్తుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడానికి పూర్తి అనుకూలత లభిస్తుంది. దాంతో వారు ఆడే ఆటల్లో సత్ఫలితాలు వాటంతట అవే వస్తాయి...

Published : 16 Jul 2021 23:45 IST

(Photo: Overtime Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రీడల్లో ఎవరైనా ఎత్తుగా ఉంటే అది వారికి బాగా కలిసొస్తుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించడానికి పూర్తి అనుకూలత లభిస్తుంది. దాంతో వారు ఆడే ఆటల్లో సత్ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అచ్చం అదే జరిగింది చైనాలోని ఓ బాలికకు. ఆమె వయసు 14 ఏళ్లు. ఎత్తు మాత్రం 7 అడుగుల 4 అంగుళాలు. దాంతో పక్కన ఉండే తోటి అమ్మాయిలు ఆమెని చూడాలంటే తల పైకెత్తాల్సిన పరిస్థితి. ఆ సహజసిద్ధ లక్షణమే ఇప్పుడు ఆమెను ఛాంపియన్‌గా చేసింది.

చైనాకు చెందిన జాంగ్‌ జియూ అనే 14 ఏళ్ల బాలిక అండర్‌-15 నేషనల్‌ లెవెల్‌ బాస్కెట్‌బాల్ టోర్నీల్లో తలపడింది. ఆమె ఆడిన జట్టు ఫైనల్‌కు చేరగా అక్కడా సునాయాస విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో జాంగ్‌జియూ మొత్తం 42 పాయింట్లు సాధించడమే కాకుండా 25 రీబౌండ్స్‌, 6 బ్లాక్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అక్కడ తనతో పాటు ఆడిన బాలికలంతా ఆమె కన్నా రెండున్నర అడుగుల ఎత్తు తక్కువ. దాంతో జాంగ్‌ చాలా తేలిగ్గా బంతిని అందుకోవడం... దాన్ని బాస్కెట్‌లోకి నెట్టేయడం చాలా సింపుల్‌గా పనిపూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆడిన జట్టు పెద్దగా కష్టపడకుండానే విజేతగా నిలిచింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం పొడగరి ఆటను మీరూ వీక్షించండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని