David Warner: ఈసారి లియోనార్డో డికాప్రియో పాత్రలో డేవిడ్‌ వార్నర్‌

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అలరించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో అతడు ఈసారి ప్రముఖ హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియో పాత్రలో ఒదిగిపోయాడు...

Updated : 15 Feb 2022 10:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌.. పలువురి నటులను అనుకరిస్తూ సోషల్‌మీడియాలో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో అతడు ప్రముఖ హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియో పాత్రలో ఒదిగిపోయాడు. సోమవారం వాలెంటైన్స్‌ డే సందర్భంగా వార్నర్‌ ఎంతో సంతోషంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసి.. తనలాగే డ్యాన్స్‌ చేసే మూడ్‌ ఎవరెవరికి ఉంది? అని అడిగాడు.

డికాప్రియో నటించిన ‘ది వూల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌’ అనే సినిమాలోని డాన్స్‌ వీడియోలకు వార్నర్‌ తన ముఖాన్ని జోడించి ఆ అనుభూతిని అభిమానులతో పంచుకున్నాడు. దీనికి తన సతీమణి క్యాండీస్‌ వార్నర్‌తో పాటు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన లభించింది. అయితే, వార్నర్‌ సంతోషానికి గల కారణం ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలం అని తెలుస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాబోయే సీజన్‌కు ముందు వదిలేయడంతో అతడు వేలంలో పాల్గొన్నాడు. దీంతో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు వార్నర్‌ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని