Dhoni: అప్పుడప్పుడు బ్రావోని కాదని నేనే బౌలింగ్‌ చేయాలనుకుంటా: ధోనీ

ఈ టీ20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. అయితే, ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక తంటాలు పడుతోంది....

Updated : 28 Apr 2022 13:38 IST

చెన్నై మాజీ సారథి ఫన్నీ వీడియో చూడండి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ టీ20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. అయితే, ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక తంటాలు పడుతోంది. ప్రస్తుతం 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నా.. ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉన్నారు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, కీలక ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ముగ్గురూ కలిసి ఓ సరదా కార్యక్రమంలో పాల్గొన్నారు. టోర్నీలోని పలు సందర్భాల్లో ఈ ఆటగాళ్లకు సంబంధించిన పలు ఫొటోలు తీయగా.. వాటికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్స్‌కు సరిపడే అర్థం వచ్చేలా కామెంట్లు చేయాలనే గేమ్‌ ఆడారు.

ఈ సందర్భంగా ధోనీ తనదైన శైలిలో హాస్యం పండించాడు. తొలుత బ్రావో తన తల దగ్గర రెండు చేతులు పెట్టుకొని ధోనీతో కలిసున్న ఫొటోను చూపించగా.. మాజీ సారథి ఇలా సమాధానాలిచ్చాడు. బ్రావో చాలా సార్లు బుర్ర పనిచేయడం లేదని తనతో చెప్పాడని జోక్‌ చేశాడు. అలాగే రుతురాజ్‌ క్రీజులో డైవింగ్‌ చేస్తున్న ఫొటోకు.. నీళ్లు లేనిచోట ఈతకొడుతున్నాడని సమాధానమిచ్చాడు. ఇక కెప్టెన్‌ జడేజాను రుతురాజ్‌ ఎగురుతూ హత్తుకొన్న ఫొటోను చూపించగా.. అది తమ మధ్య ‘బ్రోమాన్స్‌’ అని రుతురాజ్‌ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీ చిరాకుగా ఉన్న ఫొటో చూపించగా.. బ్రావో బౌలింగ్‌లో ఎవరైనా షాట్‌ ఆడితే.. వెంటనే తన గ్లోవ్స్‌ అతడికిచ్చి తాను బౌలింగ్‌ చేస్తే బాగుంటుందేమోనని, తన బౌలింగ్‌ ఇంతకన్నా చాలా మెరుగ్గా ఉంటుందని భావిస్తానని ధోనీ సరదాగా పేర్కొన్నాడు. ఆ పూర్తి వీడియో మీరూ చేసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని