Updated : 03 Feb 2022 10:06 IST

Dhoni: ధోనీ ‘అథర్వ ది ఆరిజిన్‌’ టీజర్‌ ఔట్‌.. రాక్షసుల గుంపును సంహరిస్తూ..!

(Photo: Dhoni Facebook Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇన్నాళ్లూ మైదానంలో ఆటగాడిగా, కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా, మెంటార్‌గా ఇలా అభిమానులను అలరించిన టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పుడు మరో పాత్రలోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా అతడు ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. దీంతో తన అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ‘అథర్వ ది ఆరిజిన్‌’ పేరిట సైంటిఫిక్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే నవల (ఇంకా విడుదల కాలేదు) ఆధారంగా దీన్ని అదే పేరుతో గ్రాఫిక్స్‌ రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహీ ఓ యోధుడి పాత్రలో కనిపంచనుండగా బుధవారం రాత్రి విడుదల చేసిన టీజర్‌లో రెండు చేతుల్లో కత్తులను పట్టుకొని రాక్షసుల గుంపును సంహరిస్తున్నట్లు కనిపించాడు. ధోనీ ఈ ఫస్ట్‌లుక్‌ను ఫేస్‌బుక్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. రమేశ్‌ తమిల్‌మని అనే కొత్త రచయిత ఈ కథను సిద్ధం చేశారు. కాగా, దీనికి ధోనీ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మాణ సంస్థ సహకారం అందిస్తుండటం విశేషం. ఇక 2016లో మహీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎస్‌ ధోనీ ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సైంటిఫిక్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని