IND vs AUS: దినేశ్‌ కార్తీక్‌ ‘ఫినిషింగ్‌’ చూశారా..?

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను సమయం చేసింది. వర్ష ప్రభావంతో మ్యాచ్‌ ఆలస్యమవడం.. 8 ఓవర్లకు కుదించడం

Updated : 24 Sep 2022 14:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. వర్ష ప్రభావంతో మ్యాచ్‌ ఆలస్యమవడం.. 8 ఓవర్లకు కుదించడం ఇలా ఎన్నో మలుపులు తిరిగిన రెండో టీ20లో ఉత్కంఠ కూడా అదే స్థాయిలో నడిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 90 పరుగులు సాధించగా.. దాన్ని ఛేదించేందుకు మధ్యలో టీమ్‌ఇండియా కాస్త తడబడినా.. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ ఒక సిక్స్‌, ఒక ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను విజయంతో ముగించి ‘ఫినిషర్‌’ పేరు నిలబెట్టుకున్నాడు.

7వ ఓవర్లో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఐదో బంతికి ఔటయ్యాడు. దీంతో దినేశ్ కార్తీక్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి భారత సమీకరణం 7 బంతుల్లో 14 పరుగులుగా ఉంది. ఆ తర్వాత బంతికి ఒక వైడ్ లభించడం రోహిత్‌ శర్మ బౌండరీ బాదడంతో సమీకరణం కాస్త తేలికైంది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. కార్తీక్‌ స్ట్రైక్‌లోకి వచ్చాడు. డేనియల్‌ శామ్స్‌ వేసిన తొలి బంతిని బ్యాక్వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత 5 బంతుల్లో 3 పరుగులు కొట్టాల్సి ఉండగా.. రెండో బంతినే డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా బౌండరీ బాది కార్తీక్‌ మ్యాచ్‌ను ముగించాడు.

టీమిండియా విజయం సాధించగానే అవతలి ఎండ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ పరుగెత్తుకుని వచ్చి కార్తీక్‌ను హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘‘గొప్ప ముగింపు.. గొప్ప విజయం..’’ అని రాసుకొచ్చింది. మరి దినేశ్ కార్తీక్‌ ఫినిషింగ్‌ మెరుపులను మీరూ చూసేయ్యండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని